రాష్ట్రాన్ని దుర్మార్గులకు అప్పగించొద్దు- CM కేసీఆర్

స్వతంత్ర వెబ్ డెస్క్: ఎన్నిక‌లు వ‌స్తే ప్రజలు ఆగ‌మాగం కావొద్దని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు మెదక్ భారీ బహిరంగ సభలో అన్నారు. ఎల‌క్ష‌న్లు వ‌చ్చిన స‌మ‌యంలో ప్ర‌జ‌లు త‌మ ధీర‌త్వాన్ని ప్ర‌ద‌ర్శించాలని సూచించారు. నిజ‌మేది, అబద్ధమేది, అంచనా వేసుకొని.. ఓట్లు వేయాలని అన్నారు. ఎవ‌రు ఏం మాట్లాడుతున్నారనేది తెలుసుకోవాలన్నారు. ఓవైపు బీజేపీ మోటార్లకు మీటర్లు పెట్టాలని చెబుతుందని, మరోవైపు కాంగ్రెస్ 3 గంటల కరెంటు చాలు అంటుందని సీఎం కేసీఆర్ అన్నారు. అలాగే ఘనపురం ఆయకట్టు గతంలో ఎప్పుడూ నీళ్లు రాలేదని కేసీఆర్ గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఒక్క ఛాన్స్ ఇవ్వండని అడుగుతున్నారని తెలిపారు.

ప్రతీ సంవత్సరం ధర్నా చేస్తే తప్పు నీళ్లు వచ్చే పరిస్థితి లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించారు. ఘనపురం కాల్వలో తమ్మ చెట్లు మెలిచాయన్నారు. 30 నుంచి 40 వేల ఎకరాలకు నీళ్లు అందిస్తున్నామని వెల్లడించారు. గత కాంగ్రెస్ నాయకులు సింగూరు ప్రాజెక్టుకు హైదరాబాద్ కు దత్తత ఇచ్చి ఇక్కడ మన పొలాలు ఎండబెట్టారని గుర్తు చేశారు.

రైతుబంధు, రైతుబీమా అమలు చేస్తూ.. అన్నదాతల అభివృద్ధికి కృషి చేస్తున్నామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. అలాగే 24 గంటల పాటు ఉచిత కరెంట్ ఇస్తూ.. అన్నదాతలకు అధిక దిగుబడి వచ్చేలా చేస్తున్నామని అన్నారు. మెదక్ లో పారే హల్దీ వాగు, మంజీరా వాగులపై దాదాపు 30 నుంచి 40 చెక్ డ్యాంలు కట్టుకొని ఆ నదులు 365 రోజులు సజీవంగా ఉండేలా చేసుకుంటున్నామన్నారు. కాళేశ్వరంలో భాగంగా మల్లన్న సాగర్ ద్వారా అక్కడి నుంచి అవసరం ఉన్నప్పుడల్లా వాగుల్లో నీళ్లు విడుదల చేస్తున్నామని తెలిపారు. చెక్ డ్యాంలు మత్తళ్లు దుంకుతున్నాయని కేసీఆర్ పేర్కొన్నారు.

Latest Articles

వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన నిమ్మల

మార్కాపురం జిల్లా దోర్నాల వద్ద నిర్మిస్తోన్న వెలిగొండ ప్రాజెక్ట్ పనులను ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతి పనులపై మంత్రి ఆరా తీశారు. ప్రత్యేక వాహనంలో రెండో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్