నిజం గెలవాలి అంటూ మరోసారి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి. ఇందులో భాగంగా నేటి నుంచి జనంలోకి వెళ్లనున్నారు. తన పర్యటనలో భాగంగా మూడు రోజుల పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు నారా భువనేశ్వరి. ఇప్పటికే చిత్తూరు జిల్లాతోపాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ నిజం గెలవాలి పేరుతో బాధిత కుటుంబాలను పరామర్శించారు. . తాజాగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా లో పర్యటించేందుకు సిద్ధమయ్యారు భువనేశ్వరి. చంద్రబాబు అరెస్ట్‌తో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబా లను పరామర్శించనున్నారు భువనేశ్వరి. మూడు రోజుల పాటు జరగనున్న ఈ పర్యటనలో తొలుత జగ్గంపేటలో పర్యటిస్తా రు భువనేశ్వరి. అనంతరం పెద్దాపురం, తుని, కాకినాడలోనూ బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు. వారిని ఓదార్చిమేమున్నామంటూ బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వనున్నారు.
నేడు తూర్పుగోదావరి జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటన
0
331
Previous article
Next article
Latest Articles
ఏపీ భవన్ మాజీ స్పెషల్ లైజన్ ఆఫీసర్ చిన్నప్పన్న అరెస్ట్
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఢిల్లీలోని ఆంధ్ర భవన్లో స్పెషల్ లైజనింగ్ అధికారి, స్పెషల్ ఆఫీసర్‌గా పనిచేసిన కాదూరు చిన్నప్పన్నకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. జూన్ 8 వరకు చిన్నప్పన్నకు కోర్టు రిమాండ్...
- Advertisement -
- Advertisement -


