ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. అధికార వైసీపీకి షాకులు మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు కండువాలు మార్చే పనిలో ఉన్నారు. తాజాగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వైసీపీకి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లో వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల నుంచి ఆయన వైసీపీకి దూరంగా ఉంటున్నారు. నియోజవకవర్గంలోనే ఆయన అనుచరులు, కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది.
టీడీపీలోకి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్..?
0
456
Previous article
Next article
Latest Articles
విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఒకే రోజు రెండు ప్రమాదాలు
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతి చెందారు. మరో ఆరుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అరగంట ముందు SMS-2Aలోనూ...
- Advertisement -
- Advertisement -


