మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్పేట తహశీల్దార్ సత్యనారాయణ ఏసీబీ వలకు చిక్కారు. రూ.10లక్షలు లంచం తీసుకుంటూ అధికారులకు పట్టుబడ్డారు. గచ్చిబౌలిలో ఉంటున్న ఓ వ్యక్తికి చెందిన భూమి శామీర్పేటలో ఉంది. దానికి సంబంధించిన పట్టాదార్ పాసు పుస్తకం జారీ చేసేందుకు తహశీల్దార్ రూ.10 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. బాధితుడి సమాచారంతో పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగారు ఏసీబీ అధికారులు. తహశీల్దార్ సత్యనారాయణ డ్రైవర్ బద్రి డబ్బు తీసుకుంటుండగా.. అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తహశీల్దార్ తీసుకోమంటేనే డబ్బు తీసుకున్నట్టు డ్రైవర్ బద్రి అంగీకరించినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. దీంతో తహశీల్దార్ సత్యనారాయణను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఏసీబీ వలలో శామీర్పేట తహశీల్దార్ సత్యనారాయణ
0
522
Previous article
Next article
Latest Articles
ఫౌజీ వస్తున్నాడు.. మరి.. బాలయ్య..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ, క్రేజీ మూవీ ఫౌజీ. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది ఇన్ని రోజులు సస్పెన్స్ గా ఉండేది. ఇప్పుడు డిసెంబర్...
- Advertisement -
- Advertisement -


