35.2 C
Hyderabad
Wednesday, May 6, 2026
spot_img

ఏసీబీ వలలో శామీర్‌పేట తహశీల్దార్ సత్యనారాయణ

       మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట తహశీల్దార్ సత్యనారాయణ ఏసీబీ వలకు చిక్కారు. రూ.10లక్షలు లంచం తీసుకుంటూ అధికారులకు పట్టుబడ్డారు. గచ్చిబౌలిలో ఉంటున్న ఓ వ్యక్తికి చెందిన భూమి శామీర్‌పేటలో ఉంది. దానికి సంబంధించిన పట్టాదార్ పాసు పుస్తకం జారీ చేసేందుకు తహశీల్దార్ రూ.10 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. బాధితుడి సమాచారంతో పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగారు ఏసీబీ అధికారులు. తహశీల్దార్ సత్యనారాయణ డ్రైవర్ బద్రి డబ్బు తీసుకుంటుండగా.. అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తహశీల్దార్ తీసుకోమంటేనే డబ్బు తీసుకున్నట్టు డ్రైవర్ బద్రి అంగీకరించినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. దీంతో తహశీల్దార్ సత్యనారాయణను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Latest Articles

కవిత టార్గెట్ అన్న కేటీఆరేనా?

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కుటుంబ పోరు ఇప్పుడు పతాక స్థాయికి చేరుకుంది. కొత్త పార్టీ పెట్టిన కవితను ఏమాత్రం పట్టించుకోవద్దని, ఎవరెవరో వస్తుంటారు పోతుంటారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ కేడర్‌కు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్