ఆఫ్ఘనిస్తాన్‌లో మరోసారి భూకంపం..

స్వతంత్ర వెబ్ డెస్క్: ఆఫ్ఘనిస్తాన్‌లో మరోసారి భూమి కంపించింది. ఆఫ్ఘనిస్తాన్‌లోని ఫైజాబాద్‌కు ఆగ్నేయంగా 70 కిలోమీటర్ల దూరంలో ఉదయం 10.19 గంటలకు రిక్టర్ స్కేల్‌పై 5.9 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. భూమికి 37 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్ర కేంద్రీకృతం అయింది. ఈ భూకంపం ప్రభావం జమ్మూ కాశ్మీర్, హర్యానా, పంజాబ్ ప్రాంతాల్లో కూడా కనిపించింది. శ్రీనగర్, పూంచ్ ప్రాంతాల్లో ప్రకంపనలు నమోదు అయ్యాయి. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్, పెషావర్, లాహోర్, ఇతర నగరాల్లో 6.3 తీవ్రతతో భూకంపం వచ్చిందని అక్కడి సోషల్ మీడియా వెల్లడించింది. అయితే, భూకంపం నష్టం గురించి ఇంకా తెలియరాలేదు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Latest Articles

ఫౌజీ వస్తున్నాడు.. మరి.. బాలయ్య..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ, క్రేజీ మూవీ ఫౌజీ. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది ఇన్ని రోజులు సస్పెన్స్ గా ఉండేది. ఇప్పుడు డిసెంబర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్