దీని వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..?

స్వతంత్ర వెబ్ డెస్క్: ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుకి పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే వేడి నుంచి ఉపశమనం పొందడంతో పాటు, శరీరానికి సరైన ఆకృతిలోకి మార్చుకోవడానికి సరైన మార్గం స్విమ్మింగ్ అంటున్నారు నిపుణులు. ఒక గంట పాటు ఈత కొడితే.. అది ఒక గంట పరిగెత్తినంతగా ఎక్కువ కేలరీలు బర్న్ చేయడానికి సహాయపడుతుంది. అంతేకాదు మానసిక ఒత్తిడి తగ్గడానికి కూడా స్విమ్మింగ్ ఎంతో ఉపయోగపడుతుందని అంటున్నారు. ఇవే కాదు ఈతతో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చదివేయండి..

> ఈత పూర్తి శరీరానికి వ్యాయామం అందిస్తుంది. ఈత కొట్టేటప్పుడు చేతులు, భుజాలకు బలాన్ని చేకూర్చి.. కండరాలను టోన్ చేస్తుంది. దీంతోపాటు శక్తిని కూడా పెంచుతుంది.

> స్విమ్మింగ్ శరీరాన్ని బయట నుంచి మాత్రమే కాకుండా లోపల నుంచి కూడా ఆరోగ్యవంతంగా మార్చే వ్యాయామం. స్విమ్మింగ్ గుండె, శ్వాసకోశ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఈత కొట్టడం వల్ల రక్తపోటు తగ్గుతుందని, మధుమేహం కూడా అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

> ఈత కీళ్ల నొప్పులు, వెన్నునొప్పి నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. కీళ్లనొప్పులు లేదా ఎముకలకు గాయం అయినప్పటికీ ఈత సురక్షితమని పేర్కొంటున్నారు. వేసవిలో స్విమ్మింగ్ పూల్‌లోని గోరువెచ్చని నీటిలో ఉండడం వల్ల శరీర నొప్పులు దూరమవుతాయి.

>ఈత ఊపిరితిత్తులను బలంగా చేస్తుంది. ఇది ఊపిరితిత్తులలో ఆక్సిజన్ సామర్థ్యాన్ని పెంచుతుంది. ఎక్కువ కాలం శ్వాసను బిగ పట్టుకునే సామర్థ్యం సైతం పెరుగుతుంది. ఆస్తమా రోగులకు కూడా ఈత చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు.

>త్వరగా బరువు తగ్గాలనుకుంటే ఉదయం ఈత కొట్టడానికి ఉత్తమ సమయం. అది కూడా అల్పాహారం తీసుకునే ముందు. ఉదయాన్నే ఈత కొట్టడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వును సక్రమంగా వినియోగించుకోగలుగుతుంది. శరీరం కొవ్వును శక్తిగా ఉపయోగిస్తుంది, ఇది బరువు తగ్గడాన్ని సులభతరం చేస్తుంది.

>స్విమ్మింగ్ అనేది కేలరీలు బర్న్ చేయడమే కాకుండా..బాడీ ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెస్ రిలీజ్ కోసం అద్భుతంగా ఉపయోగపడుతుంది. పొట్టను తగ్గించడంలో ఈత ఎంతో ఉపయోగపడుతుంది. రోజూ స్మిమ్మింగ్ చేయడం ద్వారా మీ ఉదరం గట్టి పడి కొద్ది రోజుల్లోనే మంచి ఆకారంలోకి వస్తుంది.

> గుండె ఆరోగ్యానికి కూడా స్విమ్మింగ్ చాలా మంచిది. దీనిని మంచి కార్డియోవాస్క్యులర్ యాక్టివిటీగా చెప్పవచ్చు. స్విమ్మింగ్ హార్ట్ మజిల్స్‌ను బలోపేతం చేస్తుంది.

>ప్ర‌తి రోజు క‌నీసం పావు గంట పాటు స్విమ్ చేస్తే. వేడి త‌గ్గి శ‌రీరం చ‌ల్ల‌బ‌డుతుంది.మ‌రియు అతి దాహం, అధిక చెమ‌ట‌లు, చికాకు వంటి స‌మ‌స్య‌లు కూడా దూరం అవుతాయి.

Latest Articles

ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు

ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్‌లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్