తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూలు విడుదల

స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణలో ఇంజనీరింగ్ ఎంట్రన్స్ కౌన్సిలింగ్ షెడ్యూలు విడుదలైంది. జూన్ 26 నుంచి ఆగస్టు 9 వరకు మూడు విడతల్లో ఇంజినీరింగ్ ప్రవేశాలు ప్రక్రియ జరగనున్నట్లు అధికారులు తెలిపారు. జూన్ 26 నుంచి మొదటి విడత ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియ ఉంటుంది. జూన్ 26న ఆన్‌లైన్‌లో కౌన్సిలింగ్ ఫీజు చెల్లింపు, ధ్రువపత్రాల స్లాట్ బుకింగ్ ఉంటుంది. జూన్ 28 నుంచి జులై 6 వరకు ధ్రువపత్రాల పరిశీలన.. జూన్ 28 నుంచి జులై 8 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు ప్రక్రియ ఉంటుంది. జులై 12న మొదటి విడత ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ షెడ్యూల్‌ను విడుదల చేశారు.

జులై 12 నుంచి 19 వరకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. జులై 21 నుంచి రెండో విడత ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. జులై 21 నుంచి 24 వరకు రెండో విడత వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ నడుస్తుంది. జులై 28న రెండో విడత ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఆగస్టు 2 నుంచి తుది విడత ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియ స్టార్టవుతుంది. ఆగస్టు 2 నుంచి 4 వరకు తుది విడత వెబ్ ఆప్షన్ల నమోదు ఉంటుంది. ఆగస్టు 7న ఇంజనీరింగ్ తుది విడత సీట్ల కేటాయింపు చేస్తారు. ఆగస్టు 7 నుంచి 9 వరకు కాలేజీల్లో చేరేందుకు గడువుగా నిర్ణయించారు. ఆగస్టు 8న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదల చేస్తారు. ఇంజనీరింగ్ సీట్లు మిగలకుండా ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశాలకు కల్పించే జోసా కౌన్సిలింగ్ కు సమాంతరంగా ఎంసెట్ కౌన్సెలింగ్ ను నిర్వహించేలా షెడ్యూల్ ను రూపొందించారు.

Latest Articles

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడారు. ప్రమాదంలో పలువురు కార్మికులు చనిపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితి, సహయక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్