వైయస్ జగన్ తిరుపతి వెళ్తుంటే ప్రభుత్వానికి ఆందోళన ఎందుకు అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా భయాందోళనలు. అశాంతి తలెత్తేలా ప్రభుత్వమే ప్రయత్నించడం దారుణమని చెప్పారు. వైయస్ జగన్ తిరుపతి ఎట్లా వస్తాడో చూస్తామని కొందరు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. వేంకటేశ్వరస్వామిని మాజీ సీఎం దర్శించుకోవడానికి అనుమతి లేకపోవడమేంటి అని ప్రశ్నించారు. దేవుడి దర్శనానికి ఒకరి అనుమతి కావాలా అని నిలదీశారు. దైవ దర్శనానికి పోలీసుల నుంచి అనుమతి తీసుకోవడం ఏనాడైనా ఉందా? అని అంబటి రాంబాబు నిలదీశారు.