డోలాపై వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు: ధూళిపాళ్ళ

స్వతంత్ర, వెబ్ డెస్క్: టీడీపీలో బలమైన దళిత, బీసీ నాయకత్వం మీద వైసీపీ కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ వ్యాఖ్యానించారు. కొండేపి శాసన సభ్యుడు, దళిత నాయకుడు డోలా వీరాంజనేయ స్వామి మీద ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు చేపడుతుందని ఆక్షేపించారు. పదే పదే స్వామినే లక్ష్యంగా దాడులు వైసీపీ దాడులు చేయడం సరికాదని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా స్వామిని దూషించి దాడికి దిగితే వైసీపీలోని దళిత నాయకులు ఒక్కరూ స్పందించలేదని మండిపడ్డారు. ప్రజల గళాన్ని పార్టీ గళాన్ని వినిపించి వీరోచితంగా పోరాడుతున్నందునే డోలా వీరాంజనేయ స్వామి మీద జగన్ కక్ష కట్టి ఇలాంటివి ప్రేరేపిస్తున్నారని అన్నారు. అవినీతి జరిగితే అధికారంలో ఉన్న మీరు చర్యలు చేపట్టకుండా.. కల్పిత ఆరోపణలు చేసి ఉద్దేశ్యపూర్వకంగా దాడులకు దిగుతారా? అంటూ మండిపడ్డారు. డోలా వీరాంజనేయ స్వామి మీద దాడి, పోలీసుల చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు.

Latest Articles

నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్లు

దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ-ఫిఫ్టీ 154 పాయింట్లు నష్టపోయి.. 24,013 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 607 పాయింట్లు నష్టపోయి.. 76,802 వద్ద ట్రేడవుతోంది. వరుసగా రెండోరోజు స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్