జూనియర్లకు, సన్నిహితులకు ప్రమోషన్లు కల్పిస్తూ సీనియర్లకు అన్యాయం చేస్తున్నారని 20 మంది కాంట్రాక్టు కార్మికులు చిమ్ని ఎక్కి నిరసన చేపట్టారు. పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్ కేశోరాం సిమెంట్ ఫ్యాక్టరీలో కాంట్రాక్టు కార్మికులు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. ప్రమోషన్లు, బేసిక్‌లో సీని యర్లను కాదని జూనియర్లకు ప్రాధాన్యతను ఇస్తున్నారని యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికా రులకు అనుకూలంగా ఉండే జూనియర్లకు ఎక్కువ బేసిక్ ఇస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం చొరవ తీసుకొని సీనియర్లకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ తో చర్చించి సీనియర్లకు న్యాయం చేస్తామని యాజమాన్యం హామీ ఇవ్వడంతో కార్మికులు నిరసన విరమిం చి కిందికి దిగారు.
కేశోరాం సిమెంట్ ఫ్యాక్టరీలో కార్మికుల నిరసన
0
449
Previous article
Latest Articles
నేను బీఆర్ఎస్ కు దూరమవుతున్నానని… మల్లారెడ్డి వ్యాఖ్యలపై చర్చ
మేడ్చల్‌లో మాజీ మంత్రి మల్లారెడ్డి వీడియో వైరల్ అయింది. ఒక కార్యకర్త పుట్టిన రోజు వేడుకల్లో మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్‌కు దూరమవుతున్నానని.. తనను మర్చిపోతున్నారని అన్నారు. స్వయంగా మల్లారెడ్డి...
- Advertisement -
- Advertisement -


