“బండి భగీరథ్‌ ఎక్కడ..?” కరీంనగర్ లో పోస్టర్ల కలకలం

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న “బండి భగీరథ్‌ ఎక్కడ..?” పోస్టర్లు ఇప్పుడు హైదరాబాద్‌ను దాటి కరీంనగర్ వరకూ చేరాయి. పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్‌ పరారీలో ఉన్నాడంటూ వెలిసిన పోస్టర్లు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

నిన్న హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో “ABSCONDING” అంటూ కనిపించిన పోస్టర్లు… ఇవాళ కరీంనగర్ వీధుల్లోనూ ప్రత్యక్షమయ్యాయి. పోస్టర్లలో “బండి సంజయ్ కొడుకు కావడంతోనే విచారణ నెమ్మదిగా సాగుతోందా..?”, “సాధారణ వ్యక్తి అయితే ఇప్పటికి అరెస్ట్ అయ్యేవాడా..?” వంటి ప్రశ్నలు ఉండటంతో రాజకీయ వేడి మరింత పెరిగింది.

మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్‌ ఎక్కడున్నాడనే ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకవైపు బాధిత కుటుంబం న్యాయం కోరుతుండగా… మరోవైపు నిందితుడు కనిపించడం లేదన్న ప్రచారం ప్రజల్లో ఆగ్రహానికి దారి తీస్తోంది.

“చట్టం ముందు అందరూ సమానమే అయితే… ఈ కేసులో ఆ సమానత్వం ఎందుకు కనిపించడం లేదు?” అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ తర్వాత కరీంనగర్‌లోనూ పోస్టర్లు ప్రత్యక్షమవడంతో ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

పోక్సో కేసు, పరారీలో ఉన్నాడన్న ఆరోపణలు, వైరల్ పోస్టర్లు… ఇవన్నీ కలిసి ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఒక్కటే చర్చగా మారాయి — “బండి భగీరథ్‌ ఎక్కడ..?”

Latest Articles

వరంగల్ మేయర్‌ పీఠంపై బండి సంజయ్‌ ఫోకస్‌.. జీహెచ్‌ఎంసీలో ప్రచారం లేనట్టేనా?

హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల ముందు కేంద్ర మంత్రి బండి సంజయ్ షాకిచ్చారు. హైదరాబాద్ కార్పొరేషన్‌ ఎన్నికల్లో బండి సంజయ్ ప్రచారం లేనట్టేనా అనే అనుమానం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ బూత్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్