ప్రధాని మోదీ ఇంధన పొదుపు మంత్రం…కాన్వాయ్‌ను తగ్గించుకున్న చంద్రబాబు, పవన్‌, మంత్రులు

  • ప్రధాని మోదీ ఇంధన పొదుపు మంత్రం
    సికింద్రాబాద్‌ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు. ఢిల్లీలో ఆచరణ
    కాన్వాయ్‌ను భారీగా కుదించుకున్నమోదీ
    సాధారణంగా మోదీ కాన్వాయ్‌లో 15 నుంచి 20 వాహనాలు
    రిపబ్లిక్‌ డే, పంద్రాగష్టు వంటి వేడుకల్లో 19 నుంచి 20 వాహనాలు
    రాష్ట్రాలకు వెళితే స్టేట్‌ ప్రోటోకాల్స్‌తో కలిపి 25 నుంచి 35 వాహనాలు
    ఢిల్లీలో ప్రస్తుతం రెండు కార్ల కాన్వాయ్‌తో ప్రధాని మోదీ
    మోదీ బాటలో మేము సైతం అంటున్న రాష్ట్రాల సీఎంలు
    చంద్రబాబు, మంత్రుల కాన్వాయ్‌లో వాహనాలు 50 శాతం తగ్గింపు
    నాలుగు వాహనాలకే సీఎం చంద్రబాబు కాన్వాయ్‌ కుదింపు
    కుదించిన కాన్వాయ్‌లతో సచివాలయానికి సీఎం, మంత్రులు
    రెండు వాహనాల్లోనే సచివాలయానికి వచ్చిన పవన్‌ కల్యాణ్‌, లోకేశ్‌

ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణపై ప్రధాని నరేంద్ర మోదీ( Narendra Modi) ఇచ్చిన సందేశం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. సికింద్రాబాద్ వేదికగా ప్రజలకు ఇంధన పొదుపుపై పిలుపునిచ్చిన ప్రధాని… అదే విషయాన్ని ఢిల్లీలో ఆచరణ చేసి చూపిస్తున్నారు.

సాధారణంగా ప్రధాని కాన్వాయ్‌లో 15 నుంచి 20 వాహనాలు ఉండగా… రిపబ్లిక్ డే, స్వాతంత్ర్య దినోత్సవం వంటి ప్రత్యేక వేడుకల్లో ఈ సంఖ్య 19 నుంచి 20 వరకు ఉంటుంది. రాష్ట్రాల పర్యటనల సమయంలో రాష్ట్ర ప్రోటోకాల్ వాహనాలతో కలిపి 25 నుంచి 35 వాహనాలు వరకు ఉండే కాన్వాయ్… ఇప్పుడు ఢిల్లీలో మాత్రం కేవలం రెండు కార్లకే పరిమితమైంది.

ప్రధాని మోదీ తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తుండగా… పలువురు ముఖ్యమంత్రులు కూడా ఇదే బాటలో నడుస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు( N. Chandrababu Naidu) తన కాన్వాయ్‌లో వాహనాల సంఖ్యను 50 శాతం తగ్గించారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు కాన్వాయ్ కేవలం నాలుగు వాహనాలతోనే కొనసాగుతోంది.

అంతేకాదు, మంత్రుల కాన్వాయ్‌లలో కూడా వాహనాల సంఖ్య తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కుదించిన కాన్వాయ్‌లతోనే సీఎం, మంత్రులు సచివాలయానికి వెళ్తున్నారు.

ఇక డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌( Pawan Kalyan),మంత్రి నారా లోకేశ్‌( Nara Lokesh) కూడా రెండు వాహనాల్లోనే సచివాలయానికి చేరుకోవడం విశేషంగా మారింది.

ప్రధాని మోదీ ఇచ్చిన ఇంధన పొదుపు మంత్రం… ఇప్పుడు దేశ నాయకులకు ఆదర్శంగా మారుతోంది.

నాయకులకు ఓకే కానీ సామాన్యుడి ముందున్న ఆప్షన్లు ఏంటి..ప్రస్తుతం ఇదే చర్చనీయాంశంగా మారింది.

Latest Articles

బీజేపీ కొత్త జాతీయ కార్యవర్గం.. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా పురంధేశ్వరి

బీజేపీ కొత్త జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. 13 మందికి జాతీయ ఉపాధ్యక్ష పదవులతో పాటు కీలక పదవులకు ఎంపిక చేసిన వారి జాబితాలను విడుదల చేసింది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుల జాబితాలో ఏపీ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్