పల్నాడు జిల్లాలో మద్యం మత్తులో వ్యక్తి హల్చల్ చేశాడు. సత్తెనపల్లిలోని చెక్క వంతెన దగ్గర బీభత్సం సృష్టించాడు తన స్నేహితులతో కలిసి నానా రచ్చ చేశాడు.
వివాహేతర సంబధం నేపథ్యంలో.. ప్రియురాలి ఇంటి దగ్గర ప్రియుడు మహేష్ స్నేహితులతో కలిసి వీరంగం సృష్టించాడు. దీంతో స్థానికులు పట్టుకునే ప్రయత్నం చేయగా.. ప్రియుడు మహేశ్ పరారయ్యాడు. అతడి స్నేహితులను కరెంట్ స్తంభానికి కట్టేసి దేహశుద్ది చేశారు మహిళలు. ప్రియురాలి భర్త నాగరాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


