తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను ఆమె గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు వీడియో సందే శాన్ని సోనియా విడుదల చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర స్వప్నాన్ని నెరవేరు స్తామని 2004లో కరీంగనర్ సభలో హామీ ఇచ్చానని గుర్తు చేసుకున్నారు. గడచిన పదేళ్లుగా ప్రజలు తమ పార్టీ పట్ల అత్యంత ప్రేమ, అభిమానాలు చూపారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా తమ పార్టీ పనిచేస్తుందని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తామని సోనియా గాంధీ స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర స్వప్నాన్ని నెరవేరుస్తాం- సోనియా
0
227
Previous article
Next article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


