ఏసీబీ వలకు చిక్కిన అవినీతి అధికారులు

    కాదేది కబ్జాలకు అనర్హం అన్నట్లుగా తయారయ్యింది తెలంగాణ ప్రభుత్వ శాఖల్లో అవినీతి అధికారుల తీరు. ఒకటి కాదు. రెండు కాదు. లెక్క తగ్గేదేలే అన్నట్లు రోజుకో బాగోతం వెలుగులోకి వస్తోంది. చేసింది శూన్యం ఆర్జించింది అనంతం. ప్రతి అడ్డగోలు పర్మిషన్స్ వెనుక అధికారుల చేతివాటమే. ఒక్కరోజులోనే 70 మందిని ఏసీబీ అరెస్ట్‌ చేసిందంటే ఏ రేంజ్‌లో అవినీతి రాజ్యమేలుతోందో ఇట్టే అర్థమైపోతుంది. మరి ఆ అవినీతి అధికారులెవరు..? ఏసీబీ వలకు ఎలా చిక్కారు.?

  తెలంగాణలో ఏసీబీ రైడ్స్‌తో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నీటిపారుదల, ట్రాన్స్‌కో, పోలీస్‌, పశుసంవర్థకశాఖలో జరగుతున్న అవి నీతి బాగోతంపై ఫోకస్‌ పెట్టిన ఏసీబీ రంగంలోకి దిగింది. వరుసగా CCS ACP నాగేశ్వరరావు దగ్గర నుంచి ఆర్టీఏ కార్యాలయాలు నాంపల్లి ఇరిగేషన్ శాఖతోపాటు కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో బాధితు లను పీడిస్తున్న లంచగొండి అధికారులను రెడ్ హ్యాండెడ్‌ పట్టుకుని కటకటాలకు పంపింది. సోదాల్లో పట్టుబడ్డ వ్యక్తి నివాసంతో పాటు, బంధువులు, అతడి అదాయానికి మించిన ఆస్తుల, బినామి వివరాలపై ఆరా తీసింది.

  RTA కార్యాలయం. ఈ పేరు వింటేనే మొత్తం ఏజెంట్‌లను దాటి వెళ్లాల్సిన పరిస్థితి. RTA శాఖలో కొద్దిరోజులుగా అవకతవలు జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న ACB అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఆఫీస్ వెలుపల ఏజెంట్లు, సిబ్బంది, కౌంటర్లలో పని చేసే వారి వద్ద ఫిట్నెస్​ సర్టిఫికేట్లు, లెర్నింగ్, డ్రైవింగ్​ లైసెన్స్​ అప్లికేషన్లతో పాటు నగదు చూసి అధికారులే అవాక్కాయ్యారు. ఇక రంగారెడ్డి జిల్లా రెడ్‌హిల్స్‌ నీటిపారుదల శాఖ కార్యాలయంలో జరిగిన ఏసీబీ రైడ్స్‌లో ముగ్గురు అవినీతి అధికారులు పట్టుబడ్డారు. మణికొండలోని నెక్నాన్‌పూర్‌లో భవన నిర్మాణానికి, ఇరిగేషన్‌ అనుమతుల కోసం ఉపేంద్రనాథ్‌రెడ్డి దరఖాస్తు చేసుకొన్నాడు. అయితే, అతడికి ఎన్‌వోసీ ఇవ్వడానికి ఇరిగేషన్‌ ఎగ్టి క్యూటివ్‌ ఇంజినీర్‌ భన్సీలాల్‌, అసిస్టెంట్‌ ఇంజినీర్‌ కే కార్తీక్‌, మరో సెక్షన్‌ ఏఈ నికేశ్‌కుమార్‌ రెండున్నర లక్షల రూపాయలు డిమాండ్‌ చేశారు. ముందుగానే లక్షన్నర తీసుకున్నా కూడా మళ్లీ లంచం కోసం అనుమతులకు ఇబ్బందులు పెట్టడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో పక్కా మాటు వేసిన ఏసీబీ ఉపేంద్రనాథ్‌ నుంచి ముగ్గురు అధికారులు లక్ష రూపాయలు తీసుకుంటుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అక్కడే ఉన్న గండిపేట సర్వేయర్‌ గణేశ్‌ కూడా 40 వేల లంచం తీసుకుంటూ పట్టుబ డ్డాడు. మొత్తం నలుగురిని అరెస్ట్‌ చేసిన ఏసీబీ నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుప రిచింది. అలాగే విద్యుత్‌ శాఖలోనూ అవినీతి చేపలు ఏసీబీ వలకు చిక్కాయి. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం నిర్వెన వద్ద కాంట్రాక్టర్‌ ఎన్‌ ప్రవీణ్‌, లక్ష్మీనారాయణకు చెందిన రెస్టారెంట్ కు పోల్ వేయడం, ట్రాన్స్​ఫార్మర్, త్రీ ఫేస్ కరెంట్​ఇచ్చేందుకు విద్యుత్ ఆఫీస్ అధికారులు 21 వేల రూపాయలు లంచం అడి గారు. దీంతో ప్రవీణ్‌ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పక్కా ప్లాన్‌ ప్రకారం రైడ్స్‌ చేసిన ఏసీబీ.. ఎస్‌ఈ నాగేంద్రకుమార్‌, డీఈ నరేందర్‌, ఏఈ మధుకర్‌లు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. వీరిని అరెస్ట్‌ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.

  చట్టాలను పరిరక్షించాల్సిన పోలీస్‌ అధికారులు కూడా భూవివాదంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. మేడ్చల్‌ జిల్లా కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో దాడులు నిర్వహించిన ఏసీబీ అధికారులు సర్కిల్ ఇన్స్‌పెక్టర్ వీరా స్వామి, ఎస్ఐ షఫిలను లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. సింగిరెడ్డి భరత్‌రెడ్డిపై భూ వివాదం కేసు నమోదైం ది. ఈ కేసును క్లోజ్ చేయడానికి 3 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేయడంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. దీంతో పక్కా ప్లాన్ ప్రకారం సీఐ, ఎస్‌లను పట్టుకున్నారు. మరోపక్క గొర్రెల స్కామ్‌పై ఫోకస్‌ పెట్టిన ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. ఈ కుంభకోణం విలువ సుమారు 700 కోట్లు ఉంటుందని అవినీతి నిరోధక శాఖ తాజా దర్యాప్తులో తేలింది. పశుసంవర్థకశాఖ మాజీ సీఈ రాంచందర్‌రావు, కల్యాణ్‌ కుమార్‌లను అరెస్ట్‌ చేశారు. 2.10 కోట్ల ప్రభుత్వ నిధులు పక్కదారిపట్టించడంతో వీరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వీరిద్దరికీ 14 రోజుల రిమాండ్​ విధించడంతో చంచల్​గూడ జైలుకు తరలించారు. ఇక ఇప్పటికే ఈ కేసులో నలుగురు అధికారులు, బినామీ అకౌంట్‌‌‌‌ హోల్డర్లను కలిపి మొత్తం 8 మందిని అరెస్ట్ చేసింది ఏసీబీ.ప్రజల కోసం పని చేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు అటు జీతం తీసుకుంటూనే ఇటు లంచాలకు మరిగారు. దీంతో విసిగిపోయిన బాధితులు ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. మరి ఏసీబీ రైడ్స్‌తో అయినా ఈ అవినీతి ఆగడాల కు అడ్డుకట్టపడాలని కోరుతున్నారు జనం.

Latest Articles

సరికొత్త సంచలనాలకు తెరలేపిన బొద్దింక జనతా పార్టీ

సోషల్ మీడియాలో వైరల్ కావడం చాలా సులువు. ఈ రోజుల్లో చీఫ్ జస్టిస్ ఓ కేసు సందర్భంగా చేశారంటున్న వ్యాఖ్యల నేపథ్యాన్ని వాడుకుని గత వారంలో కొత్తగా రెండు రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్