పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకు టెక్నాలజీని వాడుకుంటున్నామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పారదర్శకమైన సేవలు ఇంటి వద్దకే అందించేందుకు టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. పల్నాడు జిల్లా యల్లమందలో చంద్రబాబు పర్యటించారు. లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గత ఐదేళ్లు ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి అని, కనీసం నవ్వలేకపోయారని చెప్పారు.
ఇప్పుడు ఇంటింటికీ వచ్చి పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు. ఇంటి వద్ద కాకుండా ఆఫీస్‌లో ఇస్తే వెంటనే మెమో పంపిస్తానని సీఎం హెచ్చరించారు. ఫోన్లో GP ద్వారా సమాచారం వస్తుందని, డ్రోన్లను కూడా సహాయ కార్యక్రమాల్లో వినియోగిస్తున్నామని తెలిపారు. పేదవాళ్ల జీవితాల్లో వెలుగు చూడాలన్న ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. తనకు ఐదు కోట్ల మంది ప్రజలే నాకు హైకమాండ్ అని సీఎం చంద్రబాబు చెప్పారు.