Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

కలుషిత నీటి మరణాలపై వీఎంసీ కమిషనర్ ఆగ్రహం

    విజయవాడలో కలుషితనీరు తాగి ఇద్దరు మరణించడంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. మొగల్రాజపురంలో కలుషిత నీరుతాగి 2 రోజుల వ్యవధిలో ఇద్దరు మృతి చెందారు. మరో 24 మంది ఆస్పత్రిపాలయ్యారు. దీంతో నీటి సరఫరాలో నిర్లక్ష్యం వహించిన ఆరుగురు వీఎంసీ ఉద్యోగులను సస్పెండ్ చేశారు. ఇద్దరికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఆ ప్రాంతంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. కొన్ని రోజులు పైప్‌లైన్ల ద్వారా వచ్చే నీటిని తాగొద్దని ప్రజలకు సూచించారు.

    కలుషిత జలాలు నగర ప్రజలను కాటేస్తున్నాయి. మురికి కాలువల్లో వేసిన పైపులైన్లు, తప్పుపట్టి పగిలిపోయి లీకేజీల కారణంగా కలుషితమవుతున్న తాగునీరు పట్టణ, నగరవాసుల ఆయువు తీస్తోంది. అనారోగ్యంతో అనేక మంది ఆస్ప త్రుల పాలవుతున్నారు. విజయవాడలోని మొగల్రాజపురంలో కలుషిత నీరు తాగి రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు మృత్యువాత పడటం కలకలం రేపింది. మరో కొంత మంది కలుషిత నీరు తాగడంతో అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో ఆసుపత్రలలో చేరారు. కలుషిత నీరు తాగి ఆసుపత్రుల పాలయిన వారి సంఖ్య రోజురోజుకూ పెరుుగుతుంది.మూడు దశాబ్దాల క్రితం వేసిన పైపులైన్లను మార్చకపోవడంతో లీకేజీ కారణంగా నీరు కలుషితమయ్యా యని విజయవాడ మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. నీరు రంగుమారుతుంది. మురుగు నీరు తాగునీటిలో కలసి సరఫరా అవుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతోనే ఇద్దరు మృతి చెందారని విపక్ష పార్టీలు ఆరోపిస్తు న్నాయి. కలుషిత నీరు తాగడం వల్ల ఈ ఏడాది ఫిబ్రవరిలో గుంటూరులో ముగ్గురు చనిపో యారు. ఇప్పటికైనా పాత పైపులైన్లను మార్చాలని స్థానికులు కోరుతున్నారు.

    కలుషిత నీటితో ప్రజలు ప్రాణాలు గాల్లో దీపంలా మారాయి. తుప్పుపట్టిన తాగునీటి పైపులు ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో కలుషిత నీరు తాగి గుంటూరులో ముగ్గురు చనిపోగా 200 మందికిపైగా అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చేరారు. అయినా ప్రభుత్వ యంత్రాంగం అలసత్వం వీడకపోవడంతో విజయవాడ మొగల్రాజపురంలో కలుషిత జలాలు తాగి రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు బలయ్యారు. మరో 26 మంది వాంతులు, విరేచనాలతో ఆసుపత్రుల్లో చేరారు. అస్వస్థతకు గురవు తున్న వారి సంఖ్య క్రమంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. విజయవాడ లోని అనేక ప్రాంతా లకు కొద్ది నెలలుగా రంగు మారిన నీరు సరఫరా అవుతోందని ప్రజలు మొత్తుకుంటున్నా అధికారులు పట్టించు కోలేదు. మొగల్రాజపురం పటమటవారి వీధిలో పైపుల్లో వస్తున్న నీరు రంగు మారి దుర్వాసన వస్తోందం టూ ప్రజలు ఫిర్యాదు చేసినా నివారణ చర్యలు చేపట్టలేదు. తుప్పుపట్టిన పైపులైన్లు మార్చేందుకు ప్రయత్నించలేదు. నగర శివారు ప్రాంతాలకు ఇప్పటికీ రంగు మారిన నీరే సరఫరా అవుతోంది. తాగునీటి కుళాయి కనెక్షన్లకు మీటర్లు బిగించడం, ఛార్జీల పెంపుపై ప్రభుత్వం చూపిస్తున్న శ్రద్ధ ప్రజల ఆరోగ్యంపై చూపడం లేదు.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్