Andhra Pradesh | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకా హత్యకేసు దర్యాప్తు కొనసాగుతుంది. నేడు మరోమారు కడప నుంచి పులివెందులకు బయల్దేరారు సీబీఐ అధికారులు. పులివెందులలో వైఎస్ వివేక, అవినాష్ ఇళ్ల వద్దకు ఈరోజు వెళ్లి విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఆదివారం ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ వివేకా ఇళ్లను సీబీఐ అధికారులు పరిశీలించారు. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అవినాష్ రెడ్డి చెప్పినట్లు రింగ్ రోడ్డును సీబీఐ అధికారి పరిశీలించారు. రింగ్ రోడ్డును వివేకా అసిస్టెంట్ ఇనయతుల్లా, పిఏ కృష్ణారెడ్డితో కలసి సీబీఐ అధికారులు పరిశిలించారు.