బీఆర్ఎస్ దూకుడు పెంచింది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడమే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఈ మేరకు ఇటీవల జోరు పెంచిన బీఆర్ఎస్ పార్టీ ఇవాళ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ సిటీలో పర్యటించనున్నారు. కాసేపట్లో తెలంగాణ భవన్ నుంచి ఎమ్మెల్యేలతో కలసి ఫతేనగర్‌కు కేటీఆర్ వెళ్లనున్నారు. బీఆర్ఎస్ బృందంతో కలిసి ఫతేనగర్ బ్రిడ్జ్ వద్ద ఏర్పాటు చేసిన STP ప్లాంట్‌ను ఆయన పరిశీలించనున్నారు. ఇక ఉదయం 11 గంటలకు కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు క్యాంపు ఆఫీస్‌లో జరగనున్న ప్రెస్ మీట్‌లో పాల్గొని మాట్లాడనున్నారు.