కరోనా కన్నా డేంజరెస్ వైరస్ కాంగ్రెస్ అని ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యాడు. ఏడాది క్రితం చెప్పింది… ఇవాళ అక్షరాలా నిజమైందన్నారు. అసమర్థ సీఎం ఆర్థిక వృద్ధికి గొయ్యితీసి పాతరేశారని ఆరోపించారు. దేశంలోనే అగ్రభాగాన ఉన్న తెలంగాణను ఆఖరికి పడేశారని ఆక్షేపించారు. గతేడాది 10 శాతం నమోదైన జీఎస్టీ వసూళ్లు కేవలం ఒకే ఒక్క శాతం వృద్ధికి పడిపోవడం సిగ్గుచేటన్నారాయన.
చెత్త నిర్ణయాలతోనే తెలంగాణ ఆర్థికరంగంలో ఈ విధ్వంసానికి గురైందని… మతిలేని ముఖ్యమంత్రి ఘోర తప్పిదాల వల్లే ఈ సంక్షోభం ఏర్పడిందన్నారు. ప్రభుత్వ పెద్దల కమీషన్లు ఆకాశాన్ని అంటుతుంటే… రాష్ట్ర రాబడులు మాత్రం కుప్పకూలడం క్షమించరాని నేరమన్నారు. కేసీఆర్ గారి పదేళ్ల స్వర్ణయుగాన్ని చెరిపేసి… ముఖ్యమంత్రి రాసుకునే చీకటి చరిత్ర ఇదేనా అని కేటీఆర్ ప్రశ్నించారు.