ఏపీలో నాలుగు రోజులు వర్షాలుంటాయని వాతావరణ శాఖ తెలిపిందని సీఎం చంద్రబాబు చెప్పారు. చెరువులు, కాలువలు, నీటి వనరుల వద్ద అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాలపై కలెక్టర్లు, మంత్రులు, అధికారులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. అధికారులు, ప్రభుత్వ విభాగాల సన్నద్ధతపై సమీక్షించారు. వర్షాలపై ప్రజల మొబైల్ ఫోన్లకు మెసేజ్‌లు పంపి అలర్ట్ చేయాలన్నారు. చెరువు కట్టలు, కాలువ కట్టల పరిరక్షణపై దృష్టిపెట్టాలని చెప్పారు. వాగులు, కాలువల వద్ద అవసరమైన హెచ్చరిక బోర్డులు పెట్టాలని ఆదేశించారు. అప్రమత్తతతో ప్రాణ, ఆస్తినష్టం లేకుండా చేయాలని చెప్పారు. కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటుచేసి ప్రజల వినతులపై వేగంగా స్పందించాలని చంద్రబాబు తెలిపారు. ప్రకాశం, నెల్లూరు, ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు సీఎంకు తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచామని చెప్పారు.
అప్రమత్తతో ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చేయాలి – చంద్రబాబు
0
194
Previous article
Latest Articles
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నిర్ణయం వెనుక బీజేపీ బహుముఖ వ్యూహం
కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ ఆకస్మిక రాజీనామా దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. జాతీయ స్థాయిలో జరిగిన వివిధ ప్రవేశ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలపై విద్యార్థి లోకం...
- Advertisement -
- Advertisement -


