ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. అందరికీ ఆరోగ్యం, అందరికీ ఇళ్లు, రైతులకు రుణమాఫీ, కళాశా ల విద్యార్థులకు స్కూటీ ఇలా కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని సక్రమంగా నెరవేర్చలేకపో యిందని ధ్వజమెత్తారు. హైదరాబాద్ బంజారాహిల్స్లో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ బూత్ స్థాయి వర్కర్ల సమావేశంలో కిషన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. గత కేసీఆర్ ఏ విధంగా ప్రజలను మభ్యపెట్టారో రేవంత్ కూడా అదే ఫాలో అవుతున్నారని అన్నారు. కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి పయనిస్తున్నా రని విమర్శించారు. ఎమ్మెల్యేలను అక్రమంగా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు.