స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్టై జైలులో ఉంటున్న కడప ఎంపీ అవినాష్ తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి చికిత్స నిమిత్తం అధికారులు నిమ్స్ ఆస్పత్రి తీసుకువచ్చారు. చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌లో ఉన్న ఆయన శుక్రవారం అస్వస్థతకు గురవడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే మెరుగైన వైద్యం కోసం నిమ్స్‌కు తీసుకెళ్లాల్సిందిగా అక్కడి వైద్యులు సిఫార్సు చేశారు. దీంతో భాస్కర్ రెడ్డిని నిమ్స్‌కు తీసుకువచ్చి చికిత్స అందించారు. ఆయనకు గుండె సంబంధిత పరీక్షలు వైద్యులు నిర్వహించారు. ప్రత్యేక వైద్యుల సమక్షంలో ఈసీజీ, 2డీ ఎకో పరీక్షలను సైతం చేపట్టారు. అనంతరం భాస్కర్ రెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.