స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: భారత రెజ్లర్ల సమాఖ్య(WFI) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌నువెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని యోగా గురువు పతంజలి అధినేత బాబా రామ్ దేవ్ డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తమపై బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని కొన్ని రోజులుగా నిరసన చేపట్టిన మహిళా రెజ్లర్లకు ఆయన మద్దతు తెలిపారు. దేశానికి పేరు ప్రఖ్యాతలు తెచ్చి పెట్టిన రెజ్లర్లు నిరసన చేపట్టడం సిగ్గు చేటని విమర్శించారు. ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు అయినా భూషణ్‌ను ఇంత వరకూ అరెస్ట్ చేయకపోవడంపై స్పందించిన ఆయన.. అతడిని జైల్లో పెట్టే అధికారం తనకు లేదన్నారు. రాజకీయంగా ఏదైనా ప్రకటన చేస్తే.. అది పెద్ద దుమారం రేపుతోందని రామ్ దేవ్ వెల్లడించారు.