ఢిల్లీకి రామచందర్‌రావు… అధిష్టానికి బండి భగీరథ్‌ నివేదిక

తెంలగాణ బీజేపీ చీఫ్‌ రామచందర్‌రావు ఢిల్లీకి బయల్దేరారు. హస్తిన పర్యటనలో భాగంగా బీజేపీ అగ్రనేతలను రామచందర్‌రావు కలవనున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కొడుకు బండి భగీరథ్ ఎపిసోడ్‌పై పూర్తి నివేదిక కోరింది అధిష్టానం. నివేదికను రామ్ చందర్ రావు అందజేయనున్నారు.

బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో బండి సంజయ్‌ను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించాలనే డిమాండ్లు కొనసాగుతున్నాయి. ప్రతిపక్షాల నుంచి నెటిజన్లు సైతం బండి సంజయ్‌ ను కేంద్ర కేబినెట్‌ నుంచి బర్తరఫ్‌ చేయాలని కోరుతున్నారు. సోషల్ మీడియాలో బర్తరఫ్ బండి సంజయ్ ట్రెండింగ్ లో ఉంది. ఈ నేపథ్యంలోనే బండి భగీరథ్‌పై అధిష్టానం నివేదిక కోరడం ఆసక్తికరంగా మారింది.

మరోవైపు త్వరలో కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. కేంద్రమంత్రుల స్థానంలో కొత్తవారికి అవకాశం అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కేంద్రమంత్రి పదవులు, మార్పులు చేర్పులపై సూచనలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్