అంబర్‌పేటలో విషాద ఘటన.. ఆర్థిక ఇబ్బందులతో ఎంబీఏ విద్యార్థి బలవన్మరణం

హైదరాబాద్‌లోని అంబర్‌పేట ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ అప్పులు, తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురైన ఎంబీఏ విద్యార్థి శరత్‌కుమార్‌ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కుటుంబ సభ్యులతో పాటు స్థానికులను కూడా తీవ్ర విషాదానికి గురిచేసింది.

శరత్‌కుమార్‌ ఉన్నత చదువులు పూర్తి చేసి మంచి ఉద్యోగం సాధించి కుటుంబాన్ని ఆదుకోవాలని కలలు కనేవాడని తెలిసింది. అయితే ఇంట్లో నెలకొన్న క్లిష్ట పరిస్థితులు అతడిని తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేశాయి.

తండ్రి మద్యానికి బానిస కావడంతో కుటుంబ బాధ్యతలన్నీ తల్లిపైనే పడ్డాయి. కూలీ పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న తల్లి పడుతున్న కష్టాలు, పెరుగుతున్న అప్పులు యువకుడిని తీవ్రంగా కలిచివేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Latest Articles

జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్