టైగర్ ష్రాఫ్ ‘గణపథ్’ ట్రైలర్ అదిరిపోయింది!.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే..

పూజ ఎంటర్టైన్మెంట్ ఇప్పటికే దూసుకుపోతున్న భారతీయ చిత్ర పరిశ్రమలో మరో సంచలనానికి నాంది పలికింది. కొత్త తరహా ప్రపంచంలో వినూత్నమైన యాక్షన్‌ను పరిచయం చేస్తూ విడుదల చేసిన ‘గణపధ్’ ట్రైలర్ ప్రేక్షకులను మెస్మెరైజ్ చేస్తోంది. అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ‘గణపధ్’ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. వినూత్నమైన యాక్షన్‌తో కూడిన ఈ ట్రైలర్ చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకులనూ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. అక్టోబర్ 20న చిత్రం విడుదల కోసం ఎంతగానో ఎదురు చూసేలా చేసింది. టైగర్ ష్రాఫ్‌తో పాటూ కృతి సనన్, అమితాబ్ బచ్చన్ కలయికలో రాబోతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో విపరీత అంచనాలు ఉన్నాయి. ఈ ఆసక్తిని మరింత పెంచేందుకు చిత్ర బృందం ట్రైలర్‌ను విడుదల చేసింది.

గణపధ్ ట్రైలర్ ప్రేక్షకులకు ఒక యాక్షన్ విందును అందించింది. స్టన్నింగ్ విజువల్స్, ఉత్కంఠ రేపే పోరాట సన్నివేశాలతో పాటు, భారీ కాస్టింగ్ ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ ట్రైలర్ ప్రేక్షకుల్ని ఒక పెయింటింగ్ లాంటి నూతన ప్రపంచంలోకి తీసుకెళ్లింది. భవిష్యత్తును వరల్డ్ క్లాస్ వీఎఫ్ఎక్స్ ద్వారా సృష్టించి ప్రేక్షకులను ఒక అద్భుతమైన లోకంలో తీసుకెళ్లడానికి ఖర్చు కి నిర్మాతలు వెనుకాడలేదు. నిర్మాత జాకీ భగ్నని సినిమాలో క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా నిర్మించారు. గణపధ్ ట్రైలర్‌‌లో టైగర్ ష్రాఫ్ మ్యాచో ఫైట్స్, కృతి సనన్ చేసిన స్టన్నింగ్ యాక్షన్, లెజెండ్ అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రలో ఉండటంతో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.

ఈ సందర్భంగా నిర్మాత జాకీ భజ్ఞని మాట్లాడుతూ, ‘‘గణపధ్ ట్రైలర్‌కు, ఫస్ట్ సాంగ్‌కు వస్తున్న ఈ పాజిటివ్ రెస్పాన్స్ చూస్తుంటే పడ్డ కష్టం అంతా మర్చిపోయి, ప్రేక్షకుల అంచనాలు అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అక్టోబర్ 20న విడుదల కానున్న సినిమాను కూడా ఇలాగే ఆదరిస్తారని నమ్మకంగా ఉంది.’’ అని అన్నారు.

గణపధ్ : ఏ హీరో ఈస్ బార్న్.. అనే సినిమాను ప్రసిద్ధ పూజ ఎంటర్టైన్మెంట్, గుడ్ కో తో కలిసి వికాస్ బహ్ల్ దర్శకత్వంలో దేనికి రాజీ పడకుండా నిర్మించారు. ఈ చిత్రాన్ని వశు భగ్నాని, జాకీ భాగ్నని, దీప్శిక దేష్ముఖ్, మరియు వికాస్ బహ్ల్ కలిసి నిర్మించారు. దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 20న హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో భారీ ఎత్తున విడుదలకి సిద్ధం అవుతోంది.

Latest Articles

ఫౌజీ వస్తున్నాడు.. మరి.. బాలయ్య..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ, క్రేజీ మూవీ ఫౌజీ. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది ఇన్ని రోజులు సస్పెన్స్ గా ఉండేది. ఇప్పుడు డిసెంబర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్