నెల్లూరు జిల్లా కందుకూరులోని పెద్దబజారులో ఉన్న గాయత్రీ జ్యూయలర్స్ నగల దుకాణంలో అర్ధరాత్రి దొంగలు చోరీ చేశారు. సుమారు 50 లక్షల రూపాయల విలువైన బంగారం ఎత్తుకుపోయారు. మరో రెండు కిరాణా షాపులలో కూడా వారు నగదు దొంగిలించారు. చోరీకి వచ్చిన వ్యక్తి సీసీ కెమెరాలను కట్ చేసి దొంగతనం చేశాడు. సీసీ కెమెరాలు కట్ చేయడానికి ముందున్న సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. షాపు యజమాని రాజా దొంగతనం జరిగిన విషయం కందుకూరు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే నాగేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
నెల్లూరు జిల్లా కందుకూరులో గాయత్రీ జ్యూయలర్స్‌లో దొంగతనం
0
222
Previous article
Latest Articles
కాసేపట్లో బాలాపూర్ లడ్డూ వేలం పాట
బాలాపూర్ గణనాథుడి నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయయ్యాయి. గణపతిని వాహనంపైకి ఎక్కించారు. కాసేపట్లో గ్రామ ప్రదిక్షణ ప్రారంభం కానుంది. బాలాపూర్ లడ్డూ వేలంపాటలో ఈసారి కొత్తగా 9 మంది సభ్యులు పోటీలో నిలిచారు. ఇప్పటికే...
- Advertisement -
- Advertisement -


