ఎల్‌బీ నగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. శివాజీ విగ్రహాన్ని తొలగించడంతో హిందూ సంఘాలు ధర్నా చేపట్టాయి. శివాజీ మహరాజ్ విగ్రహాన్ని తొలగించడంపై ఆందోళనకారులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. విగ్రహాన్ని తొలగించినా..స్థానిక కార్పొరేటర్ గాని, ప్రజాప్రతినిధులు గాని ఎవరూ సంఘటనా స్థలానికి రాలేదు. దీంతో వారిపై హిందూ సంఘాల కార్యకర్తలు, ఛత్రపతి శివాజీ అభిమానులు భారీ ఎత్తున చేరుకొని ఆందోళన చేపట్టారు. అనంతరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, ఆందోళనకారులను అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించారు. శివాజీ విగ్రహాన్ని గుట్టుచప్పుడు కాకుండా మున్సిపల్ అధికారులకు అప్పగించటం ఏంటని ప్రశ్నించారు.