త్రిభాషా విధానాన్ని తప్పనిసరి చేసిన CBSE

దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుడుతూ CBSE( Central Board of Secondary Education) కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ విద్యా విధానం (NEP) అమలులో భాగంగా తొమ్మిదో తరగతి నుంచి త్రిభాషా విధానాన్ని తప్పనిసరి చేస్తూ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

CBSE తాజా నిర్ణయం ప్రకారం, విద్యార్థులు మూడు భాషలు తప్పనిసరిగా అభ్యసించాల్సి ఉంటుంది. ఇందులో రెండు భారతీయ భాషలు తప్పనిసరిగా ఉండాలని బోర్డు స్పష్టం చేసింది. మూడో భాషగా విదేశీ భాషను ఎంచుకునే అవకాశాన్ని కూడా విద్యార్థులకు కల్పించింది.

అయితే పదో తరగతిలో మూడో భాషకు బోర్డు పరీక్ష నిర్వహించబోమని CBSE వెల్లడించింది. విద్యార్థులపై అదనపు ఒత్తిడి లేకుండా భాషా అభ్యాసాన్ని ప్రోత్సహించడమే ఈ నిర్ణయం వెనుక ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు.

జులై 1 నుంచి ఈ కొత్త విధానం అమలులోకి రానుంది. దేశవ్యాప్తంగా ఉన్న CBSE అనుబంధ పాఠశాలలు ఈ నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంటుంది.

భారతీయ భాషల ప్రాధాన్యతను పెంచడం, విద్యార్థుల్లో బహుభాషా నైపుణ్యాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా ఈ త్రిభాషా విధానాన్ని తీసుకొచ్చినట్లు CBSE పేర్కొంది.

Latest Articles

వరంగల్ మేయర్‌ పీఠంపై బండి సంజయ్‌ ఫోకస్‌.. జీహెచ్‌ఎంసీలో ప్రచారం లేనట్టేనా?

హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల ముందు కేంద్ర మంత్రి బండి సంజయ్ షాకిచ్చారు. హైదరాబాద్ కార్పొరేషన్‌ ఎన్నికల్లో బండి సంజయ్ ప్రచారం లేనట్టేనా అనే అనుమానం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ బూత్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్