నారా రోహిత్ ప్లాన్ మార్చాడా..?

నారా రోహిత్.. ఓ వైపు పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్.. మరో వైపు సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరో. ఒకప్పుడు ఒక్క సంవత్సరంలోనే ఏడు సినిమాలు రిలీజ్ చేసిన నారా రోహిత్ ఆతర్వాత స్పీడు తగ్గించేసాడు.. ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేసి పాలిటిక్స్ లోకి వెళతాడని ప్రచారం జరిగింది. అయితే.. గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న నారా రోహిత్.. లేటెస్ట్ గా కొత్త సినిమాను స్టార్ట్ చేశాడు. ఇంతకీ.. ఈ మూవీ ఎలా ఉండబోతుంది.. అసలు నారా రోహిత్ ప్లాన్ ఏంటి..?

నారా రోహిత్.. బాణం అంటూ తెలుగు సినిమాల్లోకి దూసుకొచ్చాడు. ఆతర్వాత సోలో, అప్పట్లో ఒకడుండేవాడు, రౌడీ ఫెలో, అసుర, ప్రతినిధి తదితర సినిమాలతో వైవిధ్యం చూపించాడు. 2026లో ఏకంగా ఏడు సినిమాలు రిలీజ్ చేసాడంటే.. ఎంత స్పీడుగా సినిమాలు చేసేవాడో అర్థం చేసుకోవచ్చు. అయితే.. ఈ సినిమాల్లో కొన్ని సక్సెస్ అయ్యాయి కొన్ని ఫ్లాప్ అయ్యాయి. ఆతర్వాత నారా రోహిత్ ఆలోచనలో మార్పు వచ్చింది. ఎన్ని సినిమాలు చేసామన్నది కాదు.. ఎలాంటి సినిమా చేసామనేది ముఖ్యమని నమ్మి.. కథ విషయంలో కేర్ తీసుకోవడం కోసం స్పీడు తగ్గించారు.

ఈమధ్య కాలంలో ప్రతినిధి 2, భైరవం, సుందరకాండ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కానీ.. ఈ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. ఇదిలా ఉంటే.. నారా రోహిత్ పాలిటిక్స్ లోకి రాబోతున్నట్టుగా ఇటీవల ప్రచారం జరిగింది. ప్రచారంలో ఉన్న వార్తల పై నారా రోహిత్ రీసెంట్ గా క్లారిటీ ఇచ్చారు. రాజకీయాల్లోకి ఖచ్చితంగా వస్తానని.. అయితే.. దానికి ఇంకా టైమ్ ఉందని.. ప్రస్తుతానికి అయితే మాత్రం సినిమాల పైనే దృష్టి పెట్టినట్టుగా చెప్పారు.

రీసెంట్ గా నారా రోహిత్ కొత్త సినిమా స్టార్ట్ చేశారు. ఈ సినిమాతో చినిమిల్లి మణికుమార్ ని దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. ఆయ్ సినిమాలో నటించిన నయన్ సారిక ఈ మూవీలో నారా రోహిత్ కి జంటగా నటిస్తుంది. ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ 10 నుంచి స్టార్ట్ చేయనున్నారు. ఈ ఇయర్లోనే ఈ మూవీని రిలీజ్ చేయాలనేది ప్లాన్. ఇక నుంచి సినిమాల పై మరింతగా ఫోకస్ పెట్టి.. సరికొత్త సినిమాలు అందించాలి అనుకుంటున్నాడట నారా రోహిత్. మరి.. ఇక నుంచైనా గ్యాప్ లేకుండా సినిమాలు చేసి సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి.

Latest Articles

మహానాడు నిర్వహణపై డైలమా

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక, చమురు సంక్షోభం ప్రభావం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక వార్షిక వేడుక 'మహానాడు'పై పడేలా కనిపిస్తోంది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా దేశ ప్రధాని నుంచి రాష్ట్ర మంత్రుల వరకూ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్