రూ. 2,000 అద్దె చెల్లించలేక.. భార్య, కూతురిపై ఇంటి యజమాని అత్యాచారానికి ఒప్పందం

గుజరాత్‌లోని మోర్బీలో అమానుష ఘటన జరిగింది. అద్దె బకాయిలు చెల్లించలేకపోయిన ఓ వ్యక్తి, తన భార్యతో పాటు మైనర్ కుమార్తెపై ఇంటి యజమాని లైంగిక దాడి చేయడానికి ఒప్పందం చేసుకున్నాడనే ఆరోపణలపై పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం… సురేంద్రనగర్‌కు చెందిన ఈ కుటుంబం ఉపాధి కోసం సుమారు ఆరు నెలల క్రితం మోర్బీకి వలస వచ్చింది. అక్కడ నెలకు రూ.2 వేల అద్దెతో ఓ ఇంటిలో నివసిస్తున్నారు. అయితే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల కారణంగా నాలుగు నెలలుగా అద్దె చెల్లించలేదు.

ఈ నేపథ్యంలో, అద్దె బకాయిలకు బదులుగా తన భార్య, మైనర్ కుమార్తెపై లైంగిక దాడి చేయడానికి ఇంటి యజమానికి అనుమతి ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఈ దారుణ విషయం బాధిత మహిళ తల్లికి తెలిసిన వెంటనే ఆమె మోర్బీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు పోక్సో చట్టం సహా పలు సెక్షన్ల కింద దర్యాప్తు ప్రారంభించారు.

తదనంతరం మైనర్ బాలిక తండ్రి, ఇంటి యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు. “బాలిక తండ్రి, ఇంటి యజమాని కలిసి ఈ దారుణానికి పాల్పడ్డారు” అని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లాల్‌ తెలిపారు.

ఈ కేసులో మరో వ్యక్తి పాత్ర కూడా ఉన్నట్లు అనుమానిస్తున్న పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

Latest Articles

ఆపరేషన్‌ రేజ్‌పిల్‌లో “జిహాదీ డ్రగ్” స్వాధీనం.. క్యాప్టగాన్ అంటే ఏమిటి?

భారతదేశంలో భారీ యాంటీ డ్రగ్ ఆపరేషన్‌లో భాగంగా అరుదైన ‘క్యాప్టగాన్’ మాదకద్రవ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా (Amit Shah) వెల్లడించారు. ‘ఆపరేషన్ రేజ్‌పిల్’ పేరుతో నిర్వహించిన ఈ దాడిలో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్