ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాస్‌పోర్ట్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. తనకు ఐదేళ్ల పాటు పాస్ పోర్టు ఇవ్వాలని కోరుతూ పిటిషన్ వేశారు. వైసీపీ అధికారం కోల్పోయాక జగన్‌కు సీఎంగా ఉండే డిప్లొమేటిక్ పాస్‌పోర్ట్ రద్దైంది. దీంతో ఆయన సాధారణ పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఏడాది పాటు పాస్‌పోర్టు ఇవ్వాలని విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశించింది. పాస్‌పోర్టును ఏడాదికే పరిమితం చేయడం చట్ట విరుద్ధమని పిటిషనర్ తరపు లాయర్ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. జగన్ పాస్‌పోర్టు ఐదేళ్ల పాటు రెన్యువల్ చేస్తూ.. సీబీఐ కోర్టు ఆదేశాలు ఇచ్చిందని ఏపీ హైకోర్టుకు పిటిషనర్ తెలిపారు. విచారణ ఇవాళ్టికి వాయిదా వేయడంతో కోర్టు ఇవాళ మరోసారి విచారణ చేయనుంది.