ఆపరేషన్ బుడమేరు మొదలుపెడతామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. భవిష్యత్‌లో విజయవాడలో వరదలు రాకుండా చర్యలు చేపడతామని అన్నారు. కొల్లేరు ఆక్రమణలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆక్రమణలను కూల్చివేస్తామన్నారు. రాజకీయ అండదండలతో కొందరు విచ్చలవిడిగా వ్యవహరించారని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. 8వ రోజు కూడా కొంత మంది వరద నీటిలోనే ఉన్నారని .. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వ సహాయక చర్యలపై గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేశారని అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పాడైన వాహనాలకు బీమా సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు చంద్రబాబు.