టీపీసీసీ చీఫ్ పదవి బీసీ నేతలకు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నానని తెలిపారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. బీసీ నేతకు టీపీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని ఏఐసీసీ భావించి మహేశ్‌కుమార్ గౌడ్‌కు ఇచ్చిందని తెలిపారు. ఏఐసీసీకి ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. తాను కూడా టీపీసీసీ అధ్యక్షుడి కావాలనుకున్నానని ఎప్పటికైనా అవుతానని చెప్పారు. సీఎం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో బీసీకి పీసీసీ పదవి వచ్చిందని తెలిపారు. బీసీలకు పార్టీలో ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇచ్చారని చెప్పుకొచ్చారు.