వేలంపాటతో ప్రారంభమైన శ్రీనిధి యూనివర్సిటీ TPGL మూడో సీజన్

హైదరాబాద్, 3 అక్టోబర్ 2023: హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ నగరంలో తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ (TPGL) మూడో ఎడిషన్‌ను నిర్వహించడానికి పూర్తిగా సన్నధ్దమైనది. ఔత్సాహిక గోల్ఫ్ క్రీడాకారులని ప్రోత్సహించే రీతిలో నిర్వహిస్తున్న వార్షిక వేడుక ఇది. ఉత్సాహపూరితమైన మద్దతుదారులు, స్పాన్సర్‌ల బృందం తోడ్పాటుతో ఈ లీగ్ ప్రతి సీజన్‌లో అభివృద్ధి చెందుతోంది. గత సంవత్సరం ఉత్కంఠభరితమైన ఫైనల్‌లో విజయవంతమైన టోర్నమెంట్‌ను పూర్తి చేసేందుకు శ్రీనిధియన్ థండర్‌బోల్ట్స్ విల్లాజియో హైలాండర్స్‌ను 4 – 2 తేడాతో ఓడించింది. తద్వారా టైటిల్ స్పాన్సర్‌లకు ఉత్సాహపూరితమైన టోర్నమెంట్‌గా నిలిచింది.

హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక గోల్ఫ్ క్లబ్‌ నవ శకానికి నాంది పలికేందుకు ఇటీవల నిర్మించిన న్యూ క్లబ్‌హౌస్‌లో విజయవంతమైన వేలంతో మూడో సీజన్‌ ఆరంభానికి వేదిక సిద్ధమైంది. ఔత్సాహిక నైపుణ్యం యొక్క ఉన్నత ప్రమాణాన్ని కొనసాగిస్తూ ఈవెంట్‌ను నిర్వహించే నలుగురు సభ్యుల పాలక మండలి ద్వారా TPGL చురుకుగా నిర్వహించబడుతుంది. ఈ కౌన్సిల్‌లో చైర్మన్ జయంత్ ఠాగూర్ TPGL నిర్వాహక బృందానికి నాయకత్వం వహిస్తారు. అతనికి టి. అజయ్ రెడ్డి (వైస్ చైర్మన్), సభ్యులు డి. వందిత్ రెడ్డి, ఉత్తమ్ సింఘాల్ మద్దతు ఇస్తున్నారు. ఈ సీజన్‌ను ప్రారంభించడం వేలం ద్వారా నిర్వహించబడింది, దీనికి కౌన్సిల్ యొక్క పదహారు మంది ప్రత్యేక ఆహ్వానితులు హాజరు కావటంతో పాటుగా మద్దతు ఇచ్చారు. HGA ప్రెసిడెంట్ జయంత్ ఠాగూర్ మాట్లాడుతూ గోల్ఫింగ్ కమ్యూనిటీ కోసం మరో లీగ్‌ని నిర్వహించడం పట్ల తాము సంతోషిస్తున్నామన్నారు.
నగర గోల్ఫ్ క్రీడాకారులు ఈ మార్క్యూ ఈవెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని, నగరంలో గోల్ఫ్ కోర్స్‌‌పై ఉత్సాహం తారాస్థాయిలో ఉందని వందిత్ రెడ్డి చెప్పారు.

పోటీలో ఉన్న 16 జట్లు పూల్‌లోని 215 మంది ఆటగాళ్ల సేవలను కొనసాగించేందుకు చురుకుగా వేలంలో పాల్గొంటున్నాయి. ఐదు వారాల ఫెస్టివల్‌లో నాలుగు జట్లతో కూడిన నాలుగు గ్రూపులు లీగ్ ఫార్మాట్‌లో ఉంటాయి. క్వార్టర్‌ఫైనల్‌ నుంచి ప్రతి గ్రూప్‌లోని మొదటి రెండు జట్లు నాకౌట్ దశకు చేరుకుంటాయి. మరింత సమాచారం కోసం https://tpgl.in/ ను సందర్శించగలరు.

Latest Articles

విజయసాయిరెడ్డి లక్ష్యం నెరవేరేనా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సిద్ధమయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతగా వ్యవహరించిన ఆయన, ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్