చంద్రబాబు అసమర్ధ పాలనకు తొక్కిసలాట ఘటన నిదర్శనం- రోజా

చంద్రబాబు అసమర్ధ పాలనకు తిరుపతి ఘటన నిదర్శనమని మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. దీనికి ఎవరు బాధ్యులో తేల్చాలని డిమాండ్‌ చేశారు. అసమర్థ టీటీడీ చైర్మన్, ఎస్పీ, కలెక్టర్ వల్లే ఆరుగురి ప్రాణాలు పోయాయని ఆరోపించారు. చంద్రబాబు భజన తప్ప వీరికి ప్రజల సేవ పట్టదని మండిపడ్డారు. పోలీసులను చంద్రబాబు సేవలో పెట్టారని.. వచ్చిన భక్తులకు కనీసం సౌకర్యాలు కూడా కల్పించలేదని విరుచుకుపడ్డారు.

“ఇది ప్రభుత్వం చేసిన హత్యలే. అందరిపై క్రిమినల్ కేసులు పెట్టాలి. అల్లు అర్జున్‌కు సంబంధం లేకుండా తొక్కిసలాట జరిగితే ఆయనపై కేసు పెట్టారు. మరి తిరుపతి ఘటనలో చంద్రబాబు నుంచి బీఆర్ నాయుడు, ఎస్పీలపై కేసులు పెట్టాలి. 105 సెక్షన్ పెట్టాల్సి ఉండగా.. 194 సెక్షన్ ఎలా పెడతారు?. ఆరుగురు భక్తులు చనిపోతే హైందవ శంఖారావం నిర్వాహకులు ఏం చేస్తున్నారు?. ఆ పీఠాధిపతులు బయటకు రావాలి.

చంద్రబాబు మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేయాలి. ప్రధానమంత్రి మోదీ కూడా దీనిపై స్పందించాలి. కూటమి ప్రభుత్వం వచ్చాక దారుణాలు జరుగుతున్నాయి. సనాతన యోధుడిని అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు?. కూటమి ప్రభుత్వం ఆరుగురిని చంపేసింది. ఎవరి నిర్లక్ష్యం వలన జరిగిందో తేల్చాలి. అందరిపై కేసులు పెట్టించుకుని విచారణ జరిపించుకోవాలి. చంద్రబాబు లెగ్ మహిమ వల్ల ఎప్పుడూ జనాల చావులు తప్పటం లేదు.

గోదావరి పుష్కరాల సమయంలో 29 మంది చనిపోయారు. విజయవాడలో వరదల వలన 60 మంది చనిపోయారు. అదంతా చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే జరిగింది. అయినా సరే ఈ పాలకులకు బాధ అనిపించటం లేదు. గేమ్ ఛేంజర్ సినిమా ఫంక్షన్ మీద ఉన్న పిచ్చి శ్రీవారి భక్తుల మీద ఎందుకు చూపటంలేదు?. టీటీడీని టీడీపీ ఆఫీసులాగా మార్చేశారు. వైకుంఠ ఏకాదశికి ఎలాంటి సౌకర్యాలు కల్పించాలో టీటీడీ ఛైర్మన్‌కు తెలీదు. ఆయనకు‌ భక్తిభావమే లేదు. అలాంటి వారికి ఛైర్మన్ పదవి ఎలా ఇస్తారు?. ఎవరిని బలి చేద్దామా? అని టీటీడీ, ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఎస్పీని రక్షించటానికి డీఎస్పీ మీదకు నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం దీనిపై పారదర్శకంగా విచారణ జరపాలి”.. అని రోజా డిమాండ్ చేశారు.

Latest Articles

జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్