రెండో దశ పోలింగ్ సిద్ధమైన దక్షిణాది రాష్ట్రాలు

   లోక్ సభ ఎన్నికలు అధికార బీజేపీతో సహా అన్ని పార్టీలకూ ప్రతిష్టాత్మకంగా మారాయి. దక్షిణాదిలో బీజేపీ ఇప్పటికీ కాస్త మెరుగైన స్థితిలో ఉంది కర్ణాటక లోనే. అందువల్ల ఇక్కడి నుంచి అత్యధికంగా ఎంపీ స్థానాలను గెలుచుకోవాలని కమలం పార్టీ ఎదురు చూస్తోంది. ఇక సిద్దరామయ్య ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, కేరళ లోని పినరయి విజయన్ ఆధ్వర్యంలో ఎల్ డీఎఫ్ సర్కార్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకం గా భావిస్తున్నాయి. కర్ణాటక లోని కుమార స్వామి పార్టీ జేడీఎస్ పార్టీ మనుగడకు ఇదో అగ్నిపరీక్ష.

    లోక్ సభ ఎన్నికలు రెండో దశ పోలింగ్ కు రంగం సిద్ధమైంది. ప్రచారం ముగిసింది. సజావుగా పోలింగ్ నిర్వహణకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. 13 రాష్ట్రాల్లో 89 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతు న్నాయి. భద్రతా బలగాలను దాదాపు అన్ని పోలింగ్ కేంద్రాలవద్ద ఇప్పటికే మోహరించారు. పోలింగ్ సామగ్రి తరలింపుతోపాటు, సుదూర ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది తరలింపు చురుగ్గా సాగుతోంది. కర్ణాటకలో తొలివిడత ఏప్రిల్ 19నే 14 నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. మిగిలిన 14 నియోజకవర్గాల్లో రెండో విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. దక్షిణాదిన కాంగ్రెస్ పునరుజ్జీవనంలో కర్ణాటక కీలక పాత్ర వహించింది. 2023 మే 18న సిద్దరామయ్య ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది. డికె. శివకుమార్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కర్ణాటక సర్కార్ స్ఫూర్తి తోనే తెలంగాణ లో 2023 డిసెంబర్ లో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటుతో .. దక్షిణాదిన మళ్లీ కాంగ్రెస్ కు మంచి రోజులు వచ్చాయి. సిద్దరామయ్య సర్కార్ కు ఈ పార్లమెంటు ఎన్నికలు తొలి పరీక్షగా భావిస్తున్నా రు. కాంగ్రెస్ అధిష్టానం ఈ రెండురాష్ట్రాల్లో అత్యధిక సీట్లు సాధించడం ద్వారా కేంద్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటులో కీలకం కావాలని భావిస్తోంది.

     కర్ణాటకలో బీజేపీ, జేడీఎస్ కూటమిగా పోటీ చేస్తుండగా కాంగ్రెస్ ఒంటరి పోరు చేస్తోంది. రెండో విడతలో దక్షిణ కర్ణాటకలోని బెంగళూరు సౌత్, నార్త్, సెంట్రల్, రూరల్ సహా 14 నియోజకవర్గాలు ఎన్నికలు ఎదుర్కొంటున్నాయి.అసెంబ్లీ ఎన్నికల్లో విజయానికి దోహదపడిన ఐదు గ్యారంటీలే ఈ ఎన్నికల్లో పార్టీ విజయానికి పునాది మెట్లుగా పార్టీ భావిస్తోంది. బెంగళూరు రూరల్ నుంచి డిప్యూటీ సీఎం డికె శివకుమార్ సోదరుడు డికె సురేశ్, మాజీ ప్రధాని దేవెగౌడ అల్లుడు సిఎస్ మంజునాథ్ బీజేపీ అభ్యర్థి గా పోటీ చేస్తున్నారు. మైసూరు- కొడగు నుంచి మైసూర్ రాజవంశానికి చెందిన యుదువీర్ కృష్ణ దత్త బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తుంటే కాంగ్రెస్ చురుకైన కార్యకర్త ఎం. లక్ష్మణ్ కు సీటు ఇచ్చింది. ఈ నియోజకవర్గంలో దాదాపు నాలుగున్నర లక్షలమంది ఒక్కలింగ కమ్యునిటీ ప్రజలు ఉండడంతో ఆ వర్గం అభ్యర్థికే టికెట్ ఇచ్చింది.బీజేపీతో పొత్తులో భాగంగా జేడీఎస్ మాండ్య, హసన్, కోలార్ నియోజ కవర్గాల్లో పోటీ చేస్తోంది. మాండ్య నుంచి మాజీ ముఖ్యమంత్రి కమారస్వామి, హసన్ నుంచి దేవెగౌడ మనుమడు ప్రజ్వల్ రేవణ్ణ లోక్ సభకు పోటీ చేస్తున్నారు. కుమారస్వామికి కాంగ్రెస్ అభ్యర్థి వెంకటరమణ గౌడ పోటీ ఇస్తున్నారు. ఒక్కలింగ కమ్యునిటీకి నెలవైన ఈ స్థానం 2004 వరకూ కాంగ్రెస్ కు కంచుకోట. 2009 నుంచి జేడీఎస్ సత్తా చాటుతోంది. కుమారస్వామి ప్రతిష్టాత్మకంగా తీసుకుని లోక్ సభకు పోటీ చేస్తున్నారు. హసన్ నియోజకవర్గం నుంచి దేవగౌడ మనుమడు ప్రజ్వల్ రేవణ్ణ పోటీ చేస్తున్నారు. ఈ స్థానం నుంచే హెచ్ డి దేవెగౌడ ఐదుసార్లు గెలిచారు.

    కమ్యూనిస్ట్ ల ఏకైక కంచుకోట కేరళ. కాంగ్రెస్ కు బలమైన రాష్ట్రమే. కేరళ లోని 20 లోక్ సభ స్థానాలకు ఈనెల 26న ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలదే ప్రధాన పోటీ. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వయినాడ్ నుంచి మళ్లీ పోటీ చేయడంతో ప్రస్తుతం దేశం దృష్టిని ఆకట్టుకుంది. 2019లో వయినాడ్ లో రాహుల్ తోపాటు కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్ 20 స్థానాల్లో 19 స్థానాలను గెలుచు కుంది. దీంతో ఎల్ డీఎఫ్ ఆధ్వర్యంలోని సీఎం పినరయి విజయం ఈ సారి పార్లమెంటు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. రాహుల్ కు పోటీగా సీపీఐ జనరల్ సెక్రటరీ డి. రాజా భార్య అన్ని రాజా పోటీ చేస్తున్నారు. వయినాడ్ లోనే బీజేపీ రాష్ట్ర చీఫ్ సురేంద్రన్ పోటీ చేస్తున్నారు. గతంలో ఒక్క స్థానం కూడా గెలవని బీజేపీ తన మార్క్ చూపేందుకు తంటాలు పడుతోంది. ఇండియా కూటమిలో భాగంగా దేశ మంతా కలిసి పోటీ చేస్తున్న కాంగ్రెస్ కమ్యూనిస్ట్ లు కేరళలో మాత్రం పరస్పరం ప్రధానంగా పోటీ చేస్తున్నారు. మిత్రుల శతృత్వ పోరులో విజేత లెవరో చూడాలి.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్