25.2 C
Hyderabad
Monday, December 2, 2024
spot_img

Minister KTR: నేతన్నలకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించడమే ఏకైక లక్ష్యం..!

స్వతంత్ర వెబ్ డెస్క్: జీఎస్టీతో(GST) కేంద్ర ప్రభుత్వం నేతన్నల నడ్డివిరుస్తోందని మంత్రి కేటీఆర్(Minister KTR) మండిపడ్డారు. తెలంగాణలో రైతు బీమా(Telangana Rythu Bima) మాదిరిగానే చేనేతలకు బీమా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కేటీఆర్​అన్నారు. సీఎం కేసీఆర్​పాలనలో ( CM KCR) రాష్ట్రం అభివృద్ధిలో దూసుకువెళ్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు.

నేతన్నలకు చేయూతనిచ్చేందుకు అనేక పథకాలు తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌ పోచంపల్లిలో(Bhudan Pochampally) పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేపట్టారు. ఇందులో భాగంగా సాయిని భరత్‌ ఇంటిగ్రేటెడ్‌ హ్యాండ్లూమ్‌ యూనిట్‌ ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. పోచంపల్లిలోని ప్రధాన రహదారిపై పోలీస్‌స్టేషన్‌ వద్ద పద్మశాలీ మహాజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నేతన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు.

దీంతోపాటు సమీకృత వెజ్‌, నాన్‌ వెజ్‌ మారెట్‌, ధోబీ ఘాట్‌, మురుగు కాల్వలు, సీసీ రోడ్ల శంకుస్థాపన చేశారు. దివాలా తీసిన పోచంపల్లి చేనేత పార్కును ప్రభుత్వం కొనుగోలు చేసిందని మంత్రి కేటీఆర్ తెలిపారు.ఈ క్రమంలోనే పోచంపల్లి చేనేత పార్క్ ను పునరుద్ధరించి నేతన్నలకు ఉపాధి కల్పించాలన్నదే తమ లక్ష్యమని వెల్లడించారు. నేతన్నలను బీమాతో ఆదుకుంటామన్న కేటీఆర్ 75 ఏళ్ల వయసు వరకు నేతన్న బీమా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా రూ. 40 కోట్లతో కొత్త మగ్గాలను కొనుగోలు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.

Latest Articles

ఇక నుంచి మీ కోసం.. మీ వెంటే.. మీ జగన్‌

సంక్రాంతి తర్వాత క్యాడర్‌తోనే తానంటున్న జగన్.. ఎందుకంటే? ఇప్పటికైనా బాస్‌ క్యాడర్‌కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారని చర్చించుకుంటున్నారట నేతలు. ఇక నుంచి మీకోసం.. మీ వెంటే.. మీ జగన్‌ అన్న.. అంటూ కొత్త...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్