హైదరాబాద్‌లో కలకలం సృష్టించిన కిడ్నీ రాకెట్

హైదరాబాద్‌లో కలకలం సృష్టించిన అలకనంద హాస్పిటల్ కిడ్నీ రాకెట్ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఇప్పటికే ఆస్పత్రిని సీజ్ చేసిన ప్రభుత్వం… నలుగురు సభ్యులతో ప్రత్యేక కమిటీ వేసింది. ఉస్మానియా మాజీ సూపరింటెండెంట్‌ డాక్టర్ నాగేందర్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు అలకానంద హాస్పిటల్ ని పరిశీలించారు. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.

సరూర్ నగర్ డివిజన్ డాక్టర్స్ కాలనీలోని అలకనంద హాస్పిటల్‌లో పర్మిషన్లు లేకుండానే కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేస్తున్నారని, ఒక్కో కిడ్నీని రూ. 55 లక్షలకు అమ్ముతున్నారని ఉన్నతాధికారుల తనిఖీల్లో వెల్లడైంది.

జనవరి 21న ఆస్పత్రిపై అధికారులు దాడులు చేపట్టడంతో పేషెంట్లను అక్కడే వదిలేసి డాక్టర్లు పరారయ్యారు. అలకనంద మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్వాహకుడు డాక్టర్ సుమంత్ ను సరూర్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేసి, పోలీసులను చూసి పరారైన డాక్టర్ల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా గుట్టుచప్పుడు కాకుండా కిడ్నీ మార్పిడి చేస్తున్న ఆసుపత్రిని సీజ్ చేస్తున్నట్లు డీఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు తెలిపారు. పరారైన వారి కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగినట్లు పోలీసులు తెలిపారు.

Latest Articles

మావిగన్ అంటే ఏ బస్సెక్కాలంటూ ప్రజలు నవ్వుకుంటున్నారు- మంత్రి నారాయణ

జగన్ మావిగన్ రాజకీయ ఎత్తుగడను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని మంత్రి నారాయణ అన్నారు. మావిగన్ అంటే ఏ బస్సెక్కాలంటూ ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకు పరిపాలన సులభతరం చేసేందుకు అన్ని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్