స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా ‘ది కేరళ స్టోరీ’ సినిమా ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అనేక వివాదాల మధ్య శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. కేరళలోని 32వేల మంది మహిళలు ఇస్లాం మతంలోకి ఎలా మారారనే అంశం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. యువతులను ట్రాప్ చేసి ఐసిస్ ఉగ్రవాద సంస్థలో చేర్చారంటూ తీసిన ఈ సినిమాను నిషేధించాలంటూ కాంగ్రెస్, వామపక్షాలు డిమాండ్ చేస్తుండగా.. బీజేపీ, హిందూ సంస్థలు మాత్రం ఈ చిత్రాన్ని కచ్చితంగా చూడాలని చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ సినిమాకు రాష్ట్రంలో పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. జిహాద్, మత మార్పిడి, తీవ్రవాదం యొక్క భయంకరమైన ముఖాన్ని ఈ చిత్రం బట్టబయలు చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా ఈ చిత్రానికి మొదటి రోజు దేశవ్యాప్తంగా భారీ కలెక్షన్లు వచ్చినట్లు సమాచారం.
आतंकवाद की भयावह सच्चाई को उजागर करती फिल्म 'The Kerala Story' मध्यप्रदेश में टैक्स फ्री की जा रही है। pic.twitter.com/l5oizjqK7j
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) May 6, 2023