హైదరాబాద్ ఫిలింనగర్ లోని మూన్ షైన్ పబ్ లో అర్థరాత్రి మద్యం మత్తులో వీరంగం సృష్టించారు ఆకతాయిలు. పబ్లో పీకల దాకా మద్యం తాగిన కొందరు యువకులు ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తిం చారు. యువతితో డ్యాన్స్ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఆ యువతి వెంట వచ్చిన యువకుడు ఆకతాయిలను నెట్టేశాడు. దీంతో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. తుపాకితో బెదిరించి బీరుబాటిళ్లతో కొట్టి గాయపర్చారంటూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆకతాయిల దాడిలో ముగ్గురు యువకులు గాయపడటంతో వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
పబ్లో యువతి విషయంలో ఘర్షణకు దిగిన మందుబాబులు
0
218
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


