పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండేందుకు కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ గాంధీ భవన్‌లో మంత్రులు లేదా పార్టీ ముఖ్యనేతలు అందుబాటులో ఉండాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా పార్టీ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమానికి మొదటి రోజు విశేష స్పందన వచ్చింది. తమ సమస్యలను మంత్రి దామోదర రాజనర్సింహకు నేరుగా విన్నవించుకున్నమని ప్రజలు, కార్యకర్తలు చెబుతున్నారు. సమస్యలన్నీ పరిష్కారం అవుతాయనే నమ్మకం ఉందంటున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు.