TGPSC ద్వారా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లో BFSI స్కిల్ ప్రోగ్రామ్ ప్రారంభించిన సందర్భంగా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై సీఎం మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఇప్పటికే అన్ని శాఖల్లో భర్తీ ప్రక్రియ చేపట్టామని తెలిపారు. తెలంగాణ ఏర్పడి పదేళ్ల పూర్తయినా రాష్ట్రంలో 50 నుంచి 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని చెప్పారు. ఉద్యోగాల భర్తీని బాధ్యతగా తీసుకున్నామని..త్వరలో మరో 35వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు. ఈ భర్తీ ప్రక్రియ 2,3 నెలల్లోనే పూర్తి చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.