ఆర్. కృష్ణయ్య చరిత్ర హీనుడుగా మిగిలిపోతారని వైసీపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరావు అన్నారు. బీసీలకు మంచి చేస్తారనే ఉద్దేశ్యంతో మాజీ సిఎం జగన్ ఆర్.కృష్ణయ్యకు రాజ్యసభ పదవి ఇచ్చారనీ.. ఇప్పుడేమో చంద్రబాబుకు అమ్ముడుపోయిన వ్యక్తిగా నిలిచారని తెలిపారు.. ఆర్ కృష్ణయ్యను ప్రజలు క్షమించరని బీసీలకు పెద్ద పీట వేయాలని రాజ్య సభ సీట్లు అధికంగా వైఎస్ జగన్ ఇచ్చారని .. బీసీలకు అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని విమర్శించారు.