నేడు తెలంగాణ కేబినెట్‌ భేటీ

       నేడు తెలంగాణ కేబినెట్‌ మధ్యాహ్నం భేటీ కానుంది. సచివాలయంలో మంత్రి వర్గం సమావేశం కానుంది. లోక్‌సభ ఎన్నికల వేళ ఈ కీలక సమావేశం నిర్వహిస్తోంది. ప్రధానంగా ఆరు గ్యారెంటీల అమలుపై ఈ భేటీలో చర్చించనున్నారు. మహిళలకు వడ్డీలేని రుణ పథకం ప్రారంభంపై చర్చించే అవకాశం ఉంది. ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చిన హామీల అమలుపైనా చర్చిస్తారని సమాచారం.

     లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ రాబోతోందన్న ప్రచారం నేపథ్యంలో మంత్రివర్గ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుం ది. మహిళా సాధికారతకు సంబంధించిన అంశాలు ప్రధానంగా ఈ సమావేశంలో అజెండాలో ఉన్నాయని తెలిపాయి. స్వయం సహాయక సంఘాలమహిళలకు వడ్డీలేని రుణాల పంపిణీ పునరుద్ధరణ, వారికి 5 లక్షల జీవిత బీమా పథకం అమలు వంటి అంశాలపై మంత్రివర్గం విస్తృతంగా చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ ప్రకటించడంపై కూడా మంత్రివర్గం లో చర్చించనున్నట్లు సమాచారం. సాయంత్రం పరేడ్ గ్రౌండ్‌లో జరిగే మహిళా సదస్సులో ముఖ్యమంత్రి ఈ మేరకు నిర్ణయాలను ప్రకటించనున్నారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు 2 వేల 500 ఆర్థిక సాయం అందజేస్తామన్న హామీ ఇప్పట్లో అమలయ్యే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతు న్నా యి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వంపై ఆర్థిక భారం పడే ఎలాంటి నిర్ణయాలు ఉండకపోవ చ్చని తెలిసింది.

Latest Articles

సాయికృష్ణ బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా- తల్లి విజయలక్ష్మి

విజయవాడకు చెందిన సాయికృష్ణ మృతి కేసులో మెజిస్టీరియల్ ముందు విచారణకు హాజరయ్యారు అతని తల్లి విజయలక్ష్మి. సుమారు రెండు గంటల పాటు విచారణ అధికారి కేసుకు సంబంధించిన విషయాలను అడిగి సమాచారం తీసుకున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్