కడియం శ్రీహరికి జై కొట్టిన తాటికొండ రాజయ్య

స్వతంత్ర వెబ్ డెస్క్: కడియం శ్రీహరికి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య జై కొట్టారు. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ స్టేషన్ ఘనపూర్ అభ్యర్ధిగా కడియం శ్రీహరి అభ్యర్థిత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ టికెట్లను మొన్న సీఎం కేసీఆర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఏకంగా 115 అసెంబ్లీ టికెట్లను ప్రకటించారు సీఎం కేసీఆర్‌. అయితే.. ఈ లిస్ట్‌ లో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పేరు గల్లంతు అయింది. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే టికెట్‌ను కడియం శ్రీహరికి ఇచ్చారు సీఎం కేసీఆర్‌. గత కొన్ని రోజులుగా స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై వస్తున్న ఆరోపణలు.. సర్పంచ్‌ నవ్య వివాదం తరుణంలోనే…. ఆయనకు టికెట్‌ ఇవ్వకుండా… స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే టికెట్‌ను కడియం శ్రీహరికి ఇచ్చారు సీఎం కేసీఆర్‌. దీంతో.. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే.. తాజగా కేటీఆర్‌ రంగంలోకి దిగడంతో…కడియం శ్రీహరికి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య జై కొట్టారు.

Latest Articles

హెలో స్పేస్‌.. విక్రమ్‌ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్‌ ప్రయోగం

భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్‌-1 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్‌ స్టార్టప్‌ స్కైరూట్‌ ఏరో స్పేస్‌ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్