అశ్వత్థామ ప్రొడక్షన్స్‌లో చైతన్య పసుపులేటి, హీనా రాయ్ జంటగా అక్టోబర్ 6న థియేటర్స్‌లో విడుదల కాబోతున్న సినిమా ‘GTA’. దీపక్ సిద్ధాంత్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. మార్క్ కె రాబిన్ సంగీతం అందించిన ఈ సినిమాకు గ్యారీ బి.హెచ్ ఎడిటర్. కె.వి.ప్రసాద్ ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందించారు. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని అక్టోబర్ 6న థియేటర్స్‌లో విడుదల కానుంది.
ఈ చిత్రం రిలీజ్ పోస్టర్‌ను రచయిత దర్శకుడు కృష్ణ చైతన్య విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కొత్త కాన్సెప్ట్‌తో రాబోతున్న GTA సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను, 90కిడ్స్‌కు కనెక్ట్ అయ్యే విధంగా క్యాచీ టైటిల్‌తో ఈ సినిమా రాబోతోందని తెలిపారు. క్రైమ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను రూపొందించామని, GTA అనే గేమ్‌ను ఆధారంగా చేసుకొని ఈ సినిమాను తీశామని దర్శకుడు దీపక్ సిద్ధాంత్ తెలిపారు.
నటీనటులు:
చైతన్య పసుపులేటి, హీనా రాయ్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, కుమనన్ లోబో, రూప లక్ష్మీ, రాఖీ, చిత్రం శ్రీను తదితరులు.
సాంకేతిక నిపుణులు:
నిర్మాత: డాక్టర్ సుశీల
దర్శకత్వం: దీపక్ సిద్ధాంత్
సంగీతం: మార్క్ కె రాబిన్
ఎడిటర్: గ్యారీ బి.హెచ్
కామెరామెన్: కె.వి. ప్రసాద్
లిరిక్స్: కెకె