‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’కు అండగా ‘హనుమాన్’

సుహాస్ హీరోగా నటిస్తున్న సినిమా “అంబాజీపేట మ్యారేజి బ్యాండు”. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాకు దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 2న థియేటర్స్ ద్వారా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ‘హనుమాన్’ సినిమా హీరో తేజ సజ్జ ట్విట్టర్ (ఎక్స్) ద్వారా “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” నుంచి ‘మా ఊరు..’ లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. పాట తనకు ఎంతో నచ్చిందన్న తేజ సజ్జ మూవీ టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు

‘మా ఊరు….’ సాంగ్ కు రెహ్మాన్ లిరిక్స్ అందించగా…శేఖర్ చంద్ర మ్యూజిక్ అందించారు. కాళభైరవ పాడారు. ‘రారో మా ఊరు సిత్రాన్ని సూద్దాం…ఇటు రారో ఈ బతుకు పాటను ఇందాం. ఈ సన్నాయి నొక్కుల్లోనా ఊరించే సంగతులెన్నో ఉన్నాయ్..’అంటూ వినగానే ఆకట్టుకునేలా సాగిందీ పాట. కామెడీ డ్రామా కథతో తెరకెక్కిన “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమా ఫిబ్రవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

నటీనటులు – సుహాస్, శివాని నాగరం, శరణ్య ప్రదీప్,జబర్దస్త్ ప్రతాప్ భండారి, గోపరాజు రమణ తదితరులు

టెక్నికల్ టీమ్ –

సంగీతం – శేఖర్ చంద్ర
సినిమాటోగ్రఫీ – వాజిద్ బేగ్,
ఎడిటింగ్ – కొదాటి పవన్ కల్యాణ్
పీఆర్వో – జీఎస్ కే మీడియా, ఏలూరు శ్రీను
బ్యానర్స్ – జీఏ2 పిక్చర్స్, మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్
రచన దర్శకత్వం – దుశ్యంత్ కటికినేని

Latest Articles

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నిర్ణయం వెనుక బీజేపీ బహుముఖ వ్యూహం

కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ ఆకస్మిక రాజీనామా దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. జాతీయ స్థాయిలో జరిగిన వివిధ ప్రవేశ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలపై విద్యార్థి లోకం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్